Thursday, 29 October 2015

సరళాసాగర్ ప్రాజెక్టు (Sarala Sagar Project) -- Telangana Irrigation - Telugu version

సరళాసాగర్ ప్రాజెక్టు (Sarala Sagar Project)

సరళాసాగర్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తకోట మండలంలోని శంకరయ్యపేట గ్రామ సమీపంలో కృష్ణానదికి ఉపనది అయిన చిన్నవాగుపై నిర్మించారు. ఇది మదనాంతపురం (వనపర్తి రైల్వేస్టేషన్) నుంచి 2 కిమీ, కొత్తకోట నుంచి 5 కిమీ దూరంలో ఉన్నది. 1947లో నిర్మాణం ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు 1959లో పూర్తయింది. ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీ ఉపయోగించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆసియాఖండంలో ఈ తరహా టెక్నాలజీ ఉపయోగించిన తొలి నీటిపారుదలప్రాజెక్టు ఇదే.వనపర్తి సంస్థా నాధీశుడు తన తల్లి సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రెండు కాలువలు కల ఈ ప్రాజెక్టు వల్ల కొత్తకోట మండలానికి ప్రయోజనం కలుగుతుంది.

చరిత్ర:

1947లో అప్పటి వనపర్తి సంస్థానాధీశుడు రాజారామేశ్వరరావు తన సరళాదేవి పేరిట ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. 1948లో విమోచనాంతరం మరోసారి శంకుస్థాపన చేయబడింది. దాదాపు దశాబ్దకాలం నిర్మాణం అనంతరం 1959 జూలై 26న అప్పటి రాష్ట్ర మంత్రి జె.నర్సింగరావుచే ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది.

ఆటోమేటిక్ సైఫన్లు:

ఆటోమేటిక్ సైఫన్ల టెక్నాలజీని ఉపయోగించిన ప్రాజెక్టులలో ఇది ఆసియాలోనే మొదటిది. నీటిసామర్థ్యం గరిష్టస్థాయికి చేరినప్పుడు వాటంతట అవే సైఫన్లు తెరుచుకోవడం దీని ప్రత్యేకత. సైఫన్లు తెరవడానికి, మూయడానికి ఆపరేతర్లు అవసరం లేదు. ఈ ప్రాజెక్టు సుమారు 4500 అడుగుల పొడవు ఉంది. కుడి, ఎడమ అనే రెండు కాలువలున్నాయి. కుడికాలువ పొడవు 8 కిమీ, ఎడమ కాలువ పొడవు 17 కిమీ. 

No comments:

Post a Comment